ఇటీవల సందీప్ కిషన్ సినిమా ‘సిగ్మా’లో స్పెషల్ సాంగ్ చేసిన కేథరిన్ థ్రెస్సా.. ఇప్పుడు తనకు జంటగా ఓ సినిమాలో నటించబోతోంది. సందీప్ కిషన్ హీరోగా ‘శంభాల’ పేమ్ యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న చిత్రం ‘కరికాల’. ఇందులో హీరోయిన్‌గా కేథరిన్‌ను ఫైనల్ చేశారు. తాజాగా తనను ఈ మూవీలోకి వెల్‌కమ్ చెబుతూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో చేతిపై మిణుగురులతో యువరాణి తరహా గెటప్‌లో ఆమె కనిపించింది. ఏ న్యూ బ్యూటీ, ఏ న్యూ మిస్టరీ, ఏ మ్యాజికల్ న్యూ ఛాప్టర్ అనే క్యాప్షన్, తన లుక్‌ను బట్టి ఆమె అతీంద్రియ శక్తులు గల ప్రిన్సెస్‌గా కనిపించబోతున్నట్టు అర్థమవుతోంది.
షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది జులై 2, సెకండ్ పార్ట్ అదే ఏడాది అక్టోబర్ 28న రిలీజ్ కానుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. చందమామ కథల స్ఫూర్తితో వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సోషియో ఫాంటసీ మూవీని తెరకెక్కిస్తున్నామని మేకర్స్ చెబుతున్నారు.
